FbTelugu

పెట్రోల్ జీఎస్టీ పరిధికి ఓకే: సుబ్రమణియన్ స్పష్టం

న్యూఢిల్లీ: దేశంలో గత ఆరు నెలలుగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు జనం గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు కెవి.సుబ్రమణియన్ ఇంధన ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదనలకు తన సంపూర్ణ మద్ధతు ఉంటుందని, అయితే దీనిపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇవాళ ఫిక్కీ లేడీ ఆర్గనైజేషన్ నిర్వహించిన సమావేశంలో సుబ్రమణియన్ మాట్లాడారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు సూచించినట్లు ఆయన చెప్పారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మండుతున్న తరుణంలో సుబ్రమణియన్ జీఎస్టీ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

అయితే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేశారా లేదా నిజంగానే చేశారా అనేది మున్ముందు వెల్లడి కానున్నది. ప్రభుత్వమే ఈ వ్యాఖ్యలు చేయించిందా లేదా ప్రజల బాధలను చూసి ఆయనే మాట్లాడారా అనేది తెలియాల్సి ఉంది. దేశ వ్యాప్తంగా సాధారణ పెట్రోల్ ధర రూ.96 కు చేరుకోగా, ప్రీమియం పెట్రోల్ ధర రూ.100 దాటిపోయింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.