FbTelugu

కర్నూలులో కేసులు తగ్గిస్తున్నారు: గఫూర్

విజయవాడ: ఏపీలో కరోనా వైరస్‌ బ్లాస్ట్‌ కాబోతోందని సీపీఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ. గఫూర్‌ అన్నారు.

వైరస్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. కర్నూలులో కేసులు తగ్గడంలేదు, అధికారులే తగ్గిస్తున్నారని ఆరోపించారు. కర్నూలు పట్టణంలో కరోనా పాజిటివ్ పరీక్షలు చేయడంలేదన్నారు.

ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో ప్రజల్లో భయాందోళనకు గురువుతున్నారని అన్నారు. రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి పరీక్షలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీని పిశాచాలు పాలిస్తున్నాయా? మనుషులు పాలిస్తున్నారా? అని విస్మయం వ్యక్తం చేశారు. కర్నూలు విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆయన హితవు పలికారు.

You might also like