FbTelugu

జూనియ‌ర్ డాక్ట‌ర్లకు కెటిఆర్ వార్నింగ్

హైదరాబాద్: జూనియ‌ర్ డాక్ట‌ర్లు వెంట‌నే స‌మ్మెను విర‌మించాలని, లేక‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వు అని మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ హెచ్చరించారు. ఇవాళ ఉద‌యం నుంచి జూనియ‌ర్ డాక్టర్ల స‌మ్మె ప్రారంభం అయ్యింది.
అత్యవసర వైద్య సేవలు మినహా అన్ని సేవలను బంద్ చేసిన డాక్టర్లు నిర‌స‌న‌లో పాల్గొంటున్నారు. ఈ నెల 28 నుంచి అత్య‌వ‌స‌ర సేవ‌లూ బ‌హిష్క‌రిస్తామ‌ని జూనియర్ డాక్టర్లు ముందస్తు నోటీసు ఇచ్చారు. క‌రోనా మహమ్మారి వేళ స‌మ్మె చేయ‌డం స‌రికాద‌ని కేటీఆర్‌ అన్నారు. జూనియ‌ర్ డాక్ట‌ర్లు చేస్తున్న స‌మ్మెను వెంట‌నే విర‌మించాల‌ని, లేక‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఆయన హెచ్చ‌రించారు. వారి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తోంద‌ని అన్నారు. కాని సమ్మె విరమణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నది మాత్రం స్పష్టం చేయలేదు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లేకపోవడంతో మంత్రి కెటిఆర్ స్పందించారు.

కాగా జూనియర్ డాక్టర్ల న్యాయమైన సమ్మెకు కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పిన ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా దాటవేస్తున్నదని ఆయన విమర్శించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.