FbTelugu

2048 ని దృష్టిలో పెట్టుకొనే ఈ కార్యక్రమం: కేటీఆర్

కరీంనగర్: 2048 ని దృష్టిలో పెట్టుకొనే 24 గంటల నీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన కరీంనగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా రూ.110 కోట్లతో చేపట్టిన 24 గంటల నీటి సరఫరాను ప్రారంభించి మాట్లాడారు. కరీంనగర్ లో ఏకార్యక్రమం ప్రారంభించినా విజయవంతం అవుతుందని అన్నారు. 24 గంటలూ నీటిని సరఫరా చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్, సాగునీటి సమస్యలు పరిష్కారమయ్యాయని అన్నారు. ఇది కేసీఆర్ ముందు చూపుతోనే సాధ్యమైందని అన్నారు. గత ఆరేళ్లుగా కేసీఆర్ ఒక్కోరంగంపై దృష్టి పెట్టారని అన్నారు.

You might also like