FbTelugu

నల్లగొండ, సూర్యాపేటలో నేడు కేటీఆర్ పర్యటన

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇవాళ నల్లగొండ, సూర్యాపేట జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10:30 కి చిట్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

మధ్యాహ్నం 12:00 గంటలకు హుజూర్ నగర్ లో పర్యటించి అక్కడి నూతన ఆర్డీఓ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3:00 గంటలకు నల్లగొండలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మంత్రి కేటీఆర్ తో పాటూ మంత్రి జగదీశ్ రెడ్డి కూడా పర్యటించనున్నారు.

You might also like