సిరిసిల్ల: భవిష్యత్తు తరాల శ్రేయస్సు కోసమే హరితహారం కార్యక్రమం అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన సిరిసిల్లా నియోజకవర్గంలోని అవునూరులో 6వ విడత హరితహారం ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ సంకల్పాన్ని నెరవేర్చుదామని అన్నారు.
రాష్ట్రంలో రైతును రాజు చేయాలని, వ్యవసాయాన్ని పండుగ చేయడమే కేసీఆర్ లక్ష్యమని అన్నారు. కేసీఆర్ పాలనలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ మారిందని అన్నారు. రాష్ట్రంలో రైతులకు, పేదలకు డోకా లేదని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.