FbTelugu

వెల్ స్పన్ ఫ్లోరింగ్ ను ప్రారంభించిన కేటీఆర్

హైదరాబాద్: చందనవెల్లి పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చందనవెల్లి లో వెల్స్ పన్ ఫ్లోరింగ్ కంపెనీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు ప్రారంభించిన కంపెనీ ఇక్కడి ప్రగతికి ప్రారంభం మాత్రమేనని అన్నారు. ఇంకా అనేక కంపెనీలు చందనవెల్లికి రాబోతున్నాయన్నారు. ఈ సంవత్సరంలోనే వెల్స్ పన్ గ్రూప్ (welspun group) సుమారు రూ.2000 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని ఆయన తెలిపారు. మరో నాలుగు కంపెనీలు ఇక్కడికి రాబోతున్నాయన్నారని, వారు స్థలాన్ని కోరుతున్నట్టు తెలిపారు. ఎక్కువ కంపెనీలు రావడంతో స్థానిక యువతకి ఉపాధి వచ్చేలా కృషి చేస్తామని అన్నారు.

స్థానిక యువతకు ఉపాధి కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో 3,600 ఎకరాల పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు. ఇందుకు స్థానిక ప్రజల సహకారం కూడా కావాలని అన్నారు. చందనవెల్లి పారిశ్రామిక పార్క్ కి అవసరమైన మౌలిక వసతులు,  రోడ్డు రవాణా సౌకర్యాలను కల్పించేందుకు, రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

You might also like