FbTelugu

కేటీఆర్ రాజీనామా చేయాలి: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: కేటీఆర్ మంత్రి పదవి నుంచి తప్పుకుని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణకు సహకరించాలని కాంగ్రెస్ ఎంపీ ఏ.రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

వట్టినాగులపల్లిలో కేటీఆర్ నిర్మించిన విలాసవంతమైన భవనంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ నోటీసులు ఇచ్చినా టీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

కేటీఆర్ 111 జీఓను ఉల్లంఘించి 25 ఎకరాల్లో విలాసవంతమైన భవనం నిర్మించారని ఆయన ఆరోపించారు. వట్టినాగులపల్లి నుంచి గండిపేటకు నీరు వచ్చే కాలువను పూడ్చారని, తన భవనానికి విశాలమైన రోడ్డు వేసుకున్నారని ఆరోపించారు. కేటీఆర్‌ 111 జీఓను ఉల్లంఘించడంపై నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు వెళ్లామని ఆయన చెప్పారు. దీనిపై విచారించేందుకు 8 మంది అధికారులతో గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ వేసిందని తెలిపారు.

అదే విధంగా 301, 302 సర్వే నెంబర్లలో కేటీఆర్ సతీమణికి భూమి ఉందని, అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. అర్బణా వెంచర్స్‌కు కూడా అక్కడ భూమి ఉందని, అందులో కేటీఆర్‌కు వాటా ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారన్నారు.

You might also like