FbTelugu

సిలిండర్ కు దండం పెట్టి ఓటేశా: కేటీఆర్

హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చే ముందు ఇంట్లో ఎల్పీజీ సిలిండర్ కు దండం పెట్టి బయలుదేరానని ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

విద్యావంతులు ఓటింగ్ కు దూరంగా ఉంటారనే అపప్రదను తొలగించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఓటేయాలని ఆయన కోరారు. ఇవాళ షేక్ పేట తహశీల్దార్ కార్యాలయంలోని పోలింగ్ బూత్ లో కెటిఆర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో 39 శాతం మంది మాత్రం ఓట్లు వేశారు. ఈ ఎన్నికల్లో అంతకన్నా ఎక్కువ శాతం నమోదు కావాలని ఆయన ఆశించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.