FbTelugu

ఐపీఎల్ కోసం కేటీఆర్ వేడుకోలు

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ను హైదరాబాద్ లో నిర్వహించాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బీసీసీఐను వేడుకున్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
వచ్చే ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ ను కూడా వేదికగా చేయాలని కోరారు. తాము తీసుకున్న చర్యల కారణంగా కరోనా పారిపోయిందని, మిగతా మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్ సురక్షితంగా ఉందని కేటీఆర్ వివరించారు. ఐపీఎల్ నిర్వహణ తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలను అందిస్తుందని హామీ ఇచ్చారు. వచ్చే ఐపీఎల్ నిర్వహణ కోసం బీసీసీఐ ఐదు నగరాలను బీసీసీఐ పరిశీలిస్తోంది. అయితే హైదరాబాద్ నగరం పరిశీలనలో లేకపోవడంతో కేటీఆర్ రంగంలోకి దిగి మా దగ్గర కూడా పెట్టాలని వేడుకోలు చేశారు.

ఇదిలా ఉంటే ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. హైదరాబాద్ టీమ్ లో తెలంగాణ క్రీడాకారులు లేకపోవడాన్ని తప్పుపట్టారు. ఇక్కడ క్రీడలు నిర్వహిస్తే అడ్డుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.