FbTelugu

హిందీ భాష పై కేటిఆర్ అభ్యంతరం

హైదరాబాద్: ఢిల్లీలోని ఒక ప్రైవేటు హాస్పిటల్ లో పనిచేస్తున్న మాతృభాషలో కాకుండా హిందీలోనే మాట్లాడాలని ఆదేశించడంపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

కేరళ నర్సుల మాతృభాష వివాదంపై కెటిఆర్ స్పందించారు. రాజ్యాంగం 22 ప్రాంతీయ భాషలను అధికారికంగా గుర్తించిందని, మాతృభాషలో మాట్లాడుకోవడం వారి హక్కు అని అన్నారు. హిందీ భాషలోనే మాట్లాడాలని ఆదేశించడంపై ఆయన మండిపడుతూ ట్వీట్ చేశారు. ఢిల్లీలోని గోవింద్ బల్లభ్ పంత్ ఇనిస్టిట్యూట్ ఆప్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేష్ అండ్ రీసెర్చి యాజమాన్యం శనివారం వివాదాస్పద ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ పనిచేసే నర్సులు మలయాళంలో మాట్లాడవద్దని, హిందీలోనే మాట్లాడాలని స్పష్టం చేసింది. మాతృభాషలో మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని ఆదేశించింది. దీనిపై నర్సుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ ఆదేశాలపై లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పాలని కేరళ నర్సుల సంఘం డిమాండ్ చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.