FbTelugu

హైటెక్ సిటీ ఆర్.యు.బి ని ప్రారంభించిన కెటిఆర్

హైదరాబాద్: సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హైటెక్ సిటీ రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్.యు.బి) ని మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ ఆర్.యు.బి తో నిజాంపేట, కూకట్ పల్లి, హైటెక్ సిటీ, కె.పి.హెచ్.బి ప్రయాణించే వారికి ట్రాఫిక్ సమస్యలు తీరాయి.

అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో సుమారు 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పు కలిగిన ఆర్.యు.బిని నిర్మాణం చేశారు. ప్రతి వర్షాకాలంలో నీటి వరద కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగేది. ఈ సమస్యలన్నింటిని తీర్చుతూ కొత్తగా నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, జిహెచ్ఎంసి కార్పొరేటర్లు పాల్గొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.