FbTelugu

ఎర్రగడ్డ కార్పొరేటర్ కు కేటీఆర్ జరిమానా

హైదరాబాద్: ఎర్రగడ్డ టీఆర్ఎస్ కార్పొరేటర్ షాహిన్ బేగం కు ఐటీ మంత్రి కేటీఆర్ షాక్ ఇచ్చారు. ఆమెతో పాటు ఆమె భర్త షరీఫ్ పై ఫైన్ వేశారు.

ఎర్రగడ్డ సుల్తాన్ నగర్ బస్తీ దవాఖానా ప్రారంభోత్సవానికి కేటీఆర్ హాజరయ్యారు. ఆయన వెళ్తుండగా దారిలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కన్పించాయి. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కార్పొరేటర్ బేగం పై రూ.20 వేలు, మాస్క్ లేకుండా వచ్చిన భర్త షరీఫ్ కు రూ.20వేల జరిమానా విధించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆయన ఆదేశించారు. మంత్రి ఆదేశం ప్రకారం ఇద్దరినీ జరిమానా వేసి రశీదులు అందచేశారు.

You might also like