FbTelugu

ఖమ్మం నేతలకు కేటీఆర్ క్లాస్ !

టీఆర్ఎస్ ఖమ్మం నేతలపై ఆపార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ క్లాస్ పీకినట్టుగా సమాచారం. స్థానిక నేతల మధ్య విభేదాల నేపథ్యంలో ఇవాళ ఖమ్మం జిల్లా నేతలతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేల తీరు దురుసుగా ఉందని, కొత్త పాత అందరినీ కలుపుకు పోవాలని కేటీఆర్ సూచించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ఉంటారు పోతారు గానీ పార్టీ బలంగా ఉండటం అవసరమన్నారు. ఖమ్మం ముఖ్యనేతలైన పువ్వాడ, తుమ్మల, నామా, పొంగులేటి వంటి ముఖ్యనేతలతో కేటీఆర్ చర్చించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.