FbTelugu

సీఎం పదవికి కేటీఆర్ వందశాతం అర్హుడు: గుత్తా

హైదరాబాద్: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ముఖ్యమంత్రి పదవికి వందశాతం అర్హుడని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ప్రస్తుత రాజకీయాల్లో మాట్లాడుతున్న భాష ఏమాత్రం బాగా లేదని, ఇది మంచి సంప్రదాయం కూడా కాదని అన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమేనని, ఒకటి రెండు ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన గొప్పవాళ్లుగా ఫీల్ కాకూడదని ఆయన పరోక్షంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను టార్గెట్ చేశారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు ఏకగ్రీవం అయితే బాగుంటుందని సుఖేందర్ రెడ్డి అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.