FbTelugu

కేటీఆర్, హరీశ్ లు నిజాయితీ పరులు: పోసాని

రేవంత్ రెడ్డి డిమాండ్ విడ్డూరంగా ఉంది

హైదరాబాద్: తెలంగాణలో కేటీఆర్, హరీశ్ రావు లు హానెస్ట్ పొలిటీషియన్స్ అని సినీ నటుడు పోసాని కృష్ణ మురళి కొనియాడారు. వీళ్ళే భవిష్యత్ తెలంగాణ కు రెండు కళ్ళ లాంటి వారని ఆయన అన్నారు.

ఇవాళ పోసాని కృష్ణ మురళి మీడియాతో మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నోట్లోంచి ఊడిపడ్డట్లే కేటీఆర్ ఉంటాడు.. ఎక్కడ ఎలా ఉండాలో కేటీఆర్ కు బాగా తెలుసన్నారు. కేటీఆర్ అవినీతిని ప్రతిపక్ష నాయకులు ప్రూవ్ చేస్తే.. రేపటి నుంచి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తెలంగాణ మొత్తం తిరుగుతానని ఆయన సవాల్ చేశారు.

రెండు మూడు రోజులుగా మంత్రి కేటీఆర్ పై ఎంపీ ఏ.రేవంత్ రెడ్డి అనేక విమర్శలు చేస్తున్నారు. దర్యాప్తునకు ఆదేశిస్తే మంత్రి పదవికి రాజీనామా చేయమనడం ఏంటని ప్రశ్నించారు. ఇది ఎక్కడి లాజిక్… నాకు అర్థం కావట్లేదన్నారు. రేవంత్ రెడ్డి రూ.50లక్షలు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టిఫెన్ సన్ కి లంచం ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి అన్నారు. ఈరోజుల్లో ఇలా డబ్బులతో దొరికిన వ్యక్తి ఎవరూ లేరన్నారు.

ఇలాంటి వ్యక్తి.. కేటీఆర్ ను రాజీనామా చేయమనడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఉన్న మంచి రాజకీయ నాయకుని పై బురదజల్లడం బాధగా ఉందన్నారు. కేటీఆర్ చాలా మంచివాడని, ప్రతిపక్షాల ఆరోపణలు నమ్మకండని ఆయన పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ సీఏం కావడానికి.. ఆయన నిజాయితీ ఓక్కటే కాదు… ఈనాడు పేపర్ కూడా ఉందని అన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి ప్రజా సేవకులు ఉన్నారు. ప్రతిపక్షాలు అధికార పార్టీ వాళ్లందరూ అవినీతి పరులు అనే పరిస్థితి వచ్చిందన్నారు.

ఉత్తమ్, జానా అర్థం లేని విమర్శలు…

కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయితే తెలంగాణ భూభాగంలో 3లో 2శాతం సస్యశ్యామలం అవుతుందన్నారు. ఇంత మంచి ప్రాజెక్ట్ కడితె.. కమీషన్ ల కోసం అని ప్రతిపక్షాలు విమర్శించడం ఏంటన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి లాంటి వారు విమర్శించే ముందు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ నేతలు అద్దంలో వాళ్ల ముఖం వాళ్లు చూసుకొని మాట్లాడాలని హితవు పలికారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రజల కోసమే కడితే కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ప్రజల కోసమే కట్టారన్నారు. ప్రతిపక్ష నాయకులు ప్రజల్లో ఉంటె ఏం జరుగుతుందో జగన్ ను చూస్తే తెలుస్తుందన్నారు. టీఆర్ఎస్ ను ఓడించాలని రాజకీయాలు చేస్తే మీరు ఎప్పటికి ప్రతి పక్షంలోనే ఉంటారని పోసాని అన్నారు.

కేసీఆర్ ఎక్కడ ఉన్నాడన్నది మనకు అనవసరం.. ప్రజలకు సేవ చేస్తున్నాడా లేదా అన్నది ముఖ్యం. మీడియా కు ఒకప్పుడు ప్రజలే ముఖ్యం.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయన్నారు. ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యలు పరిష్కరించుకుంటున్నారు.

ఏపీ లో ప్రతిపక్షం అసత్యాలతో రైతులను గందరగోళానికి గురిచేస్తోందన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మంచి స్నేహం ఉంది. కేసీఆర్ చెప్తే జగన్ వింటాడు…జగన్ రిక్వెస్ట్ చేస్తే కేసీఆర్ ఆలోచిస్తాడని కొనియాడారు. పోతిరెడ్డిపాడు అంశాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు పరిష్కరించుకుంటారని అన్నారు.

బాలకృష్ణ కోపం వరిగడ్డి మంట లాంటిది…

నందమూరి బాలకృష్ణ కోపంగా మాట్లాడినా.. విమర్శించినా.. తిట్టినా ఓక నిమిషమేనన్నారు. బాలకృష్ణ హానెస్ట్ ఫెలో… సంపాదన కోసం రాజకియాల్లోకి రాలేదు. ఆయన కోపం సమాజానికి నష్టమేమి కాదు. ఏపీ సీఎం ఎన్టీఆర్ కాదు పొడిపించుకోవడానికి… జగన్.. ఆయన పొడవడు..పొడిపించుకొడని ఛమత్కరించారు.

రిపోర్టర్ మనోజ్ కుటుంబానికి రూ.50వేల సాయం…

మనోజ్ కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సహాయం ప్రకటించారు. జర్నలిస్ట్ మనోజ్ మృతి కి చింతిస్తున్నాను. నా తరుపున రూ.25 వేల ఆర్థిక సహాయం చేస్తానన్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం అయిన తరువాత మళ్ళీ రూ.25వేలు సహాయం చేస్తానన్నారు. మీడియా ప్రజలందరికీ సర్వీస్ చేసే రంగం అని అన్నారు. సినిమా పరిశ్రమ కూడా మనోజ్ కుటుంబానికి సహాయం చేయాలని పోసాని అన్నారు.

You might also like