FbTelugu

గ్రేట‌ర్‌పై కేటీఆర్ గురి!

గులాబీ పార్టీ మాంచి ఫామ్‌లో ఉంది. బీజేపీ, కాంగ్రెస్‌ల నాయ‌క‌త్వ‌లోపం టీఆర్ ఎస్‌ను మ‌రింత బల‌మైన శ‌క్తిగా ఎదిగేందుకు కార‌ణ‌మ‌వుతుంది. 2018లో కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిన‌పుడు అంద‌రూ న‌వ్వుకున్నారు. 2019 ఏడాది ముందే.. క‌థ ముగిద్దామ‌ని విప‌క్షాల‌న్నీ ఏక‌తాటిపైకి వ‌చ్చినా.. ఏం చేయ‌లేక‌పోయారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో నిజామాబాద్‌, అదిలాబాద్‌, సికింద్రాబాద్‌, మ‌ల్కాజ‌గిరి, న‌ల్గొండ త‌దిత‌ర ప్రాంతాల్లో ఓట‌మి కాస్త కుంగ‌దీసింది.

కానీ.. కేసీఆర్‌పై న‌మ్మకంతో స్థానిక ఎన్నిక‌ల్లో క్లీన్‌స్వీప్ చేశారు. దీనివెనుక కేసీఆర్ ఎంత‌గా వ్యూహ‌ర‌చ‌న‌చేశారో.. అదే విధంగా కేటీఆర్ ఆచ‌ర‌ణ దాగుంద‌నేది వాస్త‌వం. 2014లో తొలిసారి కేసీఆర్ సీఎం అయ్యాక‌.. హైద‌రాబాద్ పీఠంపై గురిపెట్టారు. కేటీఆర్ నాయ‌క‌త్వంలో గ‌త జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో పోటీప‌డ్డారు. కేటీఆర్ ఎలాగైనా.. 100 డివిజ‌న్ల‌లో గెలుస్తామంటూ స‌వాల్ విసిరారు. ఇదంతా ఓవ‌రాక్ష‌న్ అని చాలామంది అనుకున్నారు. కానీ.. 99 డివిజ‌న్ల‌లో గులాబీజెండా ఎగుర‌వేశారు.

ఎంఐఎం పోటీప‌డిన చోట‌.. టీఆర్ ఎస్ అభ్య‌ర్థులు ప్ర‌చారం చేయ‌క‌పోయినా మంచి మెజార్టీ తెచ్చుకుని అస‌దుద్దీన్‌కు సైతం ఉలికిపాటు క‌లిగించారు. 2020లోనే గ్రేట‌ర్ ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని టీఆర్ ఎస్ భావిస్తుంది. దీనిలో భాగంగానే కేటీఆర్ రంగ‌ప్ర‌వేశం చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన కార్పోరేట‌ర్ల ప‌నితీరుపై స‌మాచారం సేక‌రిస్తున్నార‌ట‌. ప్ర‌జ‌ల్లో ఎంత‌మంది క‌ల‌సిపోయారు.. ప్ర‌జాసేవ‌లో కార్పోరేట‌ర్ల‌కు ప్ర‌జ‌లు ఇచ్చే మార్కులు ఇవ‌న్నీ సేక‌రిస్తున్నార‌ట‌. అవినీతి, అక్ర‌మాలు, వ‌సూళ్ల‌తో కోట్లు కూడ‌బెట్టిన కార్పోరేట‌ర్లకు ఈ ద‌ఫా సీటు క‌ష్ట‌మేనంటున్నారు. ప‌క్కాగా గెలుస్తాడ‌ని భావించే వారికి మాత్ర‌మే టీఆర్ ఎస్ త‌ర‌పున బీఫాం ఇవ్వాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. ఈ మేర‌కు కేటీఆర్ ఏర్పాటు చేసిన కొన్ని స‌ర్వే సంస్థ‌లు న‌గ‌రంలో అంత‌ర్గ‌త స‌ర్వే చేస్తున్నాయ‌నే తెలుస్తుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.