బెంగళూరు: కర్నాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (కె.ఎస్.పి.సి.బి) యాప్ ను ముఖ్యమంత్రి బిఎస్.యడ్యూరప్ప ఆవిష్కరించారు.
సీఎం అధికారిక నివాసం కృష్ణ హాలులో ఈ కార్యక్రమం జరిగింది. ఆన్ లైన్ లోనే కార్యకలాపాలు నిర్వహించేందుకు యాప్ ను అభివృద్ధి చేయడం సంతోషకమరని సీఎం యడ్యూరప్ప అన్నారు. సాధారణ ప్రజలు తమ సమస్యలపై నేరుగా యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు. క్షేత్రస్థాయిలో పరిశ్రమల్లో ఏం జరుగుతుందో కూడా ఆఫీసులోనే కూర్చుని తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రఅటవీ శాఖ మంత్రి ఆనంద్ సింగ్, కర్నాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ విజయ కుమార్ గోగి, సభ్య కార్యదర్శి శ్రీనివాసులు, మండలి సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.