FbTelugu

కరోనా రోగులతో కృష్ణపట్నం కిటకిట

నెల్లూరు: కృష్ణపట్నం లో ఇవ్వాల్టి నుంచి ఆయుర్వేద మందు ప్రారంభిస్తున్నారని తెలిసిన వెంటనే తెల్లవారు జాము నుంచి పెద్ద సంఖ్యలో కరోనా బాధితులు చేరుకుంటున్నారు. మందు తీసుకునేందుకు వందలాది సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. వేలాది మంది కృష్ణపట్నం వైపు అడుగులు వేశారు.

జనం రద్దీ పెరగడంతో పోలీసులు భారీ సంఖ్యలో అడుగడుగున చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. రద్దీ పెరగడంతో బయట వ్యక్తులను రాకుండా పోలీసులు నియంత్రణలో తీసుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే కృష్ణపట్నం లోని ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ చేసే ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు ఉండిపోయారు. కృష్ణపట్నం నుంచి 3 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది ఎక్కడికక్కడ వాహనాలు నుంచి పోతున్నాయి. చివరకు మీడియా వాహనాలు కూడా ట్రాఫిక్ లో చిక్కుకుని పోయాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.