FbTelugu

పరవళ్లు తొక్కుతున్న కృష్ణా

హైదరాబాద్:డతెరిపి లేని వర్షాలకు కృష్ణా నది పరవళ్లు తొక్కుతున్నది. నాగార్జున సాగర్, తుంగభద్ర జలాశయాలకు వరదనీటి ప్రవాహం పెరిగింది. వర్షాలతో పలు జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి.

సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 566.70 అడుగులకు నీరు చేరుకున్నది. ఇన్ ఫ్లో 42,378 క్యూసెక్కులు కాగా, ఓట్ ఫ్లో 4,107 క్యూసెక్కులుగా ఉంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదనీటి ప్రవాహం పెరిగింది.
తుంగభద్ర జలాశయం గరిష్ట నీటిమట్టానికి చేరింది. అదనపు నీటిని వదిలేందుకు స్పిల్ వే లో 8 గేట్లను ఎత్తేశారు. జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం 1631.62 అడుగులుగా ఉంది. ఇన్‌ఫ్లో 49,073 క్యూసెక్కులు.. అవుట్‌ఫ్లో 6,963 క్యూసెక్కులు. జలాశయం నుంచి విడుదలైన నీళ్లు సుంకేసుల ప్రాజెక్టుకు చేరుకోవడంతో సుంకేసుల డ్యామ్ ఒక గేట్‌ను ఎత్తి 2,800 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేశారు.

You might also like