FbTelugu

కృష్ణా పై జగన్ మాట తప్పాడు: మోత్కుపల్లి

హైదరాబాద్: కృష్ణా జిల్లాకు స్వర్గీయ ఎన్టీఆర్ పేరు పెడ్తానని సీఎం వైఎస్. జగన్ మాట తప్పాడని బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు.

కృష్ణా జిల్లాకు వెంటనే ఎన్టీ రామారావు పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో జగన్ గెలుపులో నా కృషి కూడా ఉందని, ఆయన గెలవాలని కాలి నడకన తిరుమల కొండ ఎక్కాను అని అన్నారు. ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులర్పించిన బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడారు. నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావు ను అవమానించటం అంటే దళితులను అవమానించిట్లేనని ఆయన అన్నారు. డాక్టర్ సుధాకర్ పై ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఆయన తెలిపారు.

ఎన్టీఆర్ జయంతి, వర్థంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా చేయాల‌ని కేసీఆర్ ను కోరుతున్నాని అన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టకుంటే.. కేసీఆర్ ఎక్కడ? ఉండేవారో ఒకసారి అర్థం చేసుకుంటే మంచిదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. ఎన్టీఆర్ జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

You might also like