FbTelugu

వ్యాపారాలను విస్తరించుకుంటోన్న కంపెనీ. రూ.755 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకిన షేరు.

దేశంలో నూలు, బట్టలు, వస్త్రాలు, వైట్ క్రిస్టల్ షుగర్ వ్యాపారాలు నిర్వహించే కే.పీ.ఆర్ మిల్ లిమిటెడ్ తన ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్నులను అందించింది. కేవలం ఒక్క ఏడాదిలోనే 285 శాతం రిటర్నులను అందజేసి ఇన్వెస్టర్లకు ఫేవరెట్ స్టాక్‌గా నిలిచింది. 2021 జనవరి 13న రూ.193.62గా ఉన్న ఈ షేరు ధర, నేటికి రూ.744.7కి పెరిగింది. ఈ ఏడాదిలో రూ.755 వద్ద 52 వారాల గరిష్ట స్థాయిని, రూ.177.02 వద్ద కనిష్ట స్థాయిలను ఈ స్టాక్ తాకింది.                                                                               కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఇక్విప్‌మెంట్, టూల్స్ యాక్సస్‌తో ఈ కంపెనీ ఆటోమేటెడ్ బిజినెస్ వ్యాపారాలను నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలకు తన ఉత్పత్తులను ఈ కంపెనీ సరఫరా చేస్తుంది. రెడీమేడ్ అల్లిన వస్త్రాలు, దుస్తులు వంటి వాటితో కే.పీ.ఆర్ మిల్ లిమిటెడ్ టెక్స్‌టైల్ రంగంలో రాణిస్తోంది. 2021 నవంబర్‌లో కంపెనీ తన తయారీ సామర్థ్యాన్ని విస్తరించింది. కొత్తగా తమిళనాడులో చెంగపల్లిలో 42 మిలియన్ గార్మెంట్స్ ప్రొడక్షన్ కెపాసిటీని ఏర్పాటు చేసింది. దీంతో వార్షికంగా మొత్తం గార్మెంట్స్ తయారీ సామర్థ్యం 157 మిలియన్లకు పెరిగింది.

ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుతోన్న కంపెనీ…
ప్రస్తుతం కంపెనీ తన షుగర్, కో జనరేషన్, ఇథనాల్ ప్రొడక్షన్ కెపాసిటీని 10,000 టీసీడీకి, 47 మెగావాట్లకి, 230 కేఎల్‌పీడీకి పెంచాలని ప్లాన్ చేస్తుంది. కంపెనీ పర్‌ఫార్మెన్స్ పరంగా చూస్తే, ఆర్థిక సంవత్సరం 2022 ప్రథమార్థంలో కంపెనీ మొత్తం రెవెన్యూలలో దిగుమతులు 67 శాతం ఉండగా… మిగిలిన 33 శాతం రెవెన్యూలు ఎగుమతుల ద్వారా వచ్చాయి.

రూ.737.55 వద్ద ట్రేడింగ్…
ఈ కాలంలో కంపెనీ గ్రాస్ సేల్స్ 44.5 శాతం పెరిగి రూ.2,166.30 కోట్లకు పెరగగా.. కంపెనీ మొత్తం ఆదాయం(అన్ని ఖర్చులు పోను) వార్షికంగా 137.38 శాతం పెరిగి రూ.410.29 కోట్లుగా ఉంది. ప్రస్తుతం కే.పీ.ఆర్ మిల్ లిమిటెడ్ షేరు రూ.737.55 వద్ద ట్రేడవుతోంది. బుధవారం క్లోజింగ్‌లో ఈ కంపెనీ షేరు ధర రూ.744.7 గా ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.