FbTelugu

కోయంబేడు మార్కెట్.. 3వేల క‌రోనా కేసులు

* త‌మిళ‌నాడు, ఏపీ రాష్ట్రాల్లో భ‌యాందోళ‌న‌

ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ల‌లో త‌మిళ‌నాడు చెన్నైలోని కోయంబేడు మార్కెట్ ఒక‌టి. కేవ‌లం త‌మిళ‌నాడు నుంచే కాదు తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా పెద్ద సంఖ్య‌లో వ్యాపారులు, రైతులు వెళ్లి క్ర‌య‌విక్ర‌యాలు చేస్తుంటారు.

క‌రోనావైర‌స్‌కు కోయంబేడు మార్కెట్ అతిపెద్ద హాట్‌స్పాట్‌గా మారింది. ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మ‌ర్క‌జ్ త‌బ్లిఘీ జ‌మాతే త‌ర్వాత, ఆ స్థాయిలో కోయంబేడు మార్కెట్ ద్వారా క‌రోనావైర‌స్ విస్త‌రిస్తోంది. కేవ‌లం త‌మిళ‌నాడులోనే కాదు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ పెద్ద‌సంఖ్య‌లో పాజిటివ్ కేసులు రావ‌డం వెనుక కోయంబేడు మార్కెట్ లింకులు ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు.
కోయంబేడు మార్కెట్ అతిపెద్ద హాట్‌స్పాట్‌గా మారి అటు తమిళ‌నాడు, ఇటు ఏపీలో ఆందోళ‌న క‌లిగిస్తోంది.

మార్కెట్‌లో చిన్నా, పెద్దా క‌లిపి 3వేల దుకాణాలు ఉన్నాయి. ప‌గ‌లు, రాత్రీ తేడా లేకుండా ఎప్పుడూ వ్యాపారుల‌తో సంద‌డిగా ఉంటుంది. ఎప్పుడూ క్ర‌య‌విక్ర‌యాలు సాగుతూనే ఉంటాయి. ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, క‌డ‌ప‌, క‌ర్నూలు, ప్ర‌కాశం జిల్లాల నుంచి పెద్ద‌సంఖ్య‌లో వ్యాపారులు, రైతులు ఇక్క‌డికి వెళుతుంటారు. ఈ మార్కెట్ కేంద్రంగా ఇప్ప‌టివ‌ర‌కు 3000వేల క‌రోనా కేసులు వెలుగు చూశాయి. మొద‌ట మార్కెట్‌లో ఒక రిటైల్ వ్యాపారికి క‌రోనా వ‌చ్చింది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన అధికారులు రిటైల్ షాపుల‌ను ఏప్రిల్ 30 నుంచి మూసివేయించారు. అప్ప‌టికే మార్కెట్‌లో వేలాది మందికి క‌రోనా అంటుకుంది.

త‌మిళ‌నాడు వంద‌ల సంఖ్య‌లో కేసులు పెరుగుతుండ‌టం, అంద‌రూ కోయంబేడు మార్కెట్‌కు వెళ్లోచ్చిన వారే కావ‌డంతో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం స్పందించింది. మే 5న మార్కెట్ మూసివేయించింది. త‌ర్వాత వ్యాపారులు, రైతుల ఇబ్బందుల దృష్ట్యా కేవ‌లం టోకు వ్యాపారాన్నే అనుమ‌తిని‌స్తోంది. కానీ అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. త‌మిళ‌నాడులో 3వేల మంది కోయంబేడ్ మార్కెట్ ద్వారా క‌రోనా సోకింది. ఈ మూడు వేల మంది ఎన్ని వేల మందితో కాంటాక్టు అయ్యార‌న్న‌ది ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఈ విష‌యంలో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సైతం ఆందోళ‌న‌కు గుర‌వుతోంది.
కోయంబేడు ప్ర‌భావం ఏపీలోని 5 జిల్లాల‌పైన బాగా ప‌డింది. ఈ జిల్లాల నుంచి 1500-2000 మంది మార్కెట్‌కు వెళ్లొచ్చిన‌ట్లు ఏపీ ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోంది. వీరిలో ఇప్ప‌టివ‌ర‌కు 60 మందికి క‌రోనా సోకింది. వీరంద‌రూ కోయంబేడు మార్కెట్‌కు వెళ్లొచ్చామ‌ని ఒప్పుకొన్నారు. అంతేకాదు క‌రోనా వ‌చ్చిన 60 మందిలో 50 మంది కేవ‌లం చిత్తూరు జిల్లాలోనే ఉండ‌టం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. వీరి కార‌ణంగా చిత్తూరు జిల్లాలో కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ జిల్లాలో 121 మంది క‌రోనా బారిన ప‌డ్డారు. ఏపీలో 2051 కేసులు పాజిటివ్‌గా ఉన్నాయి. కొత్త‌గా వ‌చ్చిన 33 కేసుల్లో 20 కేసులు కోయంబేడు మార్కెట్కు వెళ్లోచ్చిన వారే న‌ని ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఆ మార్కెట్కు ఎవ‌రెవ‌రూ వెళ్లోచ్చారో గుర్తించి, వారితోపాటు కాంటాక్టు అయిన వారికి ప‌రీక్ష‌లు చేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. మార్కెట్‌కు వెళ్లోచ్చిన వారు స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని చెబుతోంది.

You might also like