FbTelugu

కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకోదు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

హైదరాబాద్: దేశంలో కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదని, తప్పుల మీద తప్పులు చేస్తున్నదని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతు ఉద్యమం ద్వారా మంచి జోష్ వచ్చిందని, దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిందన్నారు.

రాష్ట్రంలో సిఎం కెసిఆర్ వ్యతిరేకులను ఒకేతాటిపై తీసుకురావాలనేది తన లక్ష్యమని, అందుకు తగ్గట్టుగా పనిచేస్తూ వెళ్తున్నానని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ మధ్య తనను కొందరు ముస్లిం స్నేహితులు బిజెపి లో చేరాలని ఒత్తిడి చేశారని, ఆ తరువాత మోదీ పరిపాలన చూసి వద్దని చెబుతున్నారని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఏం చేయాలనేది స్పష్టత రాకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఏ పార్టీలో చేరాలనేది మూడు నెలల్లో నిర్ణయం తీసుకుంటానని, నచ్చకపోతే స్వతంత్రంగానే ఉంటానని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.