FbTelugu

ఆరేండ్లలోనే కొమురవెల్లి ఘననీయ అభివృద్ధి: మంత్రి అల్లోల

గడిచిన ఆరేండ్లలోనే కొమురవెల్లి మల్లన్న క్షేత్రం ఘననీయంగా అభివృద్ధి చెందిందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇవాళ ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు కొమురవెల్లి మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

మల్లన్నస్వామికి 5 తులాల బంగారు మీసాన్ని సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన సతీమణి విజయలక్ష్మిలకు దేవస్థాన కార్యనిర్వహణాధికారి, అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్న భక్తులకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం 130 ఎకరాల భూమిని కేటాయించిందని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.