FbTelugu

ఇది కేసీఆర్ అనాలోచిత నిర్ణయం: కోమటిరెడ్డి

నల్లగొండ: వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయమని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతి పరులను తీసివేయాలి తప్ప వ్యవస్థను కాదని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు కమీషన్ల కోసమే గానీ రైతుల కోసం కాదని అన్నారు. సీఎం ఉత్తర తెలంగాణకే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడని.. దక్షిణ తెలంగాణ జిల్లాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

You might also like