FbTelugu

పింక్ మ్యాచ్ టిక్కెట్లు ఫుల్ సేల్

కోల్ కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో తొలిసారి టీమిండియా డై అండ్ నైట్ మ్యాచ్ ఆడనున్నది. అయితే ఈ మ్యాచ్ కోసం రెండు దేశాలకు చెందిన క్రీడాభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. నాలుగురోజుల పాటు జరిగే మ్యాచ్ టిక్కెట్లు అన్నీ విక్రయించారని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలిపారు. బంగ్లాదేశ్ ప్రధాని షఏక్ హసీనా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ మ్యాచ్ కు ప్రధాన అతిథులుగా హాజరవుతున్నారన్నారు. ఈడెన్ గార్డెన్ లో ఈ మ్యాచ్ ను మమత, హసీనా బెల్ మోగించి ప్రారంభిస్తారన్నారు. సచిన్ టెండూల్కర్, అభినవ్ బింద్రా, సానియా మీర్జా, పీవీ సింధూ, మేరికోమ్ లను సన్మానించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

You might also like