FbTelugu

అరచెయ్యి తో 2 నిమిషాల్లో కరోనా ఫలితం

చెన్నై: ముక్కులోంచి స్వాబ్ తీసుకోకుండానే కేవలం అరచేయ్యిని ట్రాకర్ పై పెడితే చాలు సదరు వ్యక్తికి కరోనా పాజిటివ్ సోకిందా లేదా అనేది స్పష్టం చేస్తుంది. ఇది కూడా కేవలం రెండు నిమిషాల్లోనే తేల్చుతుంది.

చెన్నై కీజపక్కంలోని కెజె ఆసుపత్రి పిజి రీసెర్చి సెంటర్ సైంటిస్టులు కెజె కోవిడి ట్రాకర్ పేరుతో ఒక పరికరం రూపొందించారు. ఈ పరికరంలో నానో, మెడికల్, ఎలక్ట్రానిక్ సాంకేతికను వాడారు. ఈ ట్రాకర్ ను లాపీ కి అనుసంధానం చేసి పరీక్షలు చేశారు. పరీక్ష చేయించుకోవాలనే వారి అరచేతిని కోవిడ్ ట్రాకర్ పై పెడితె రెండే రెండు నిమిషాల వ్యవధిలో ఆ వ్యక్తి రక్తపోటు, ఆక్సిజన్ స్థాయులు, ఉష్ణోగ్రత, రక్తకణాల సంఖ్య, బీటా పొటెన్షియల్ స్థాయులు, హిమోగ్లోబిన్ వివరాలు తెలిసిపోతాయి. ఈ వివరాలన్ని లాపీలో స్పష్టంగా కన్పంచడం వల్ల ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉందా లేదా అనేది తేల్చవచ్చు.

ఈ ట్రాకర్ తో పలు ప్రభుత్వ ఆసుపత్రులలో పరీక్షించి వందశాతం కచ్చితమైన ఫలితాలను రాబట్టినట్టు కెజె ఆసుపత్రి సూపరింటెండెంట్ కేశవన్ జగదీశన్ తెలిపారు. ఆర్.టి.పి.సి.ఆర్ తో పోల్చితే మరింత కచ్చితత్వంతో ఫలితాలు వస్తున్నాయన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.