FbTelugu

ముద్దెంత పనిచేసే నారాయణా!

ఇండియాలో స్వామీజీలు, బాబాలు, భూతవైద్యులకు కొదువ లేదు. మూఢ నమ్మకాలతో నిత్యం చాలామంది మునిగి తేలుతుంటారు.

అనారోగ్యం పాలైనా, కష్టాలు పోవాలన్నా వారి దగ్గరకే వెళుతుంటారు. ఇలా వారి వద్దకు వెళ్లి అత్యాచారాలకు గురైన మహిళలు, రూ.లక్షలు, కోట్లలో డబ్బులు పోగొట్టున్నవారు. చివరకు ప్రాణాలు పోగొట్టుకున్న వారినీ చూశాం. చివరకు డబ్బులు (లంకెబిందెలు) దొరుకుతాయని ఆశపెడితే చిన్న పిల్లలను, కుటుంబ సభ్యులను బలి ఇవ్వడమూ చూశాం. ఇలా వారి మోసాలు అనేకం బయటపడుతున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు.

వారిని నమ్మి అనేకమంది జీవితాలను కోల్పోతూనే ఉన్నారు. తాజాగా కరోనా నేపథ్యంలో కూడా ఓ భూత వైద్యుడిని నమ్మి 20మంది నిండా మునిగారు. వాస్తవానికి కరోనాను నియంత్రించడానికి వైద్య సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. దీని నివారణకు ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్‌ను కనుగొనే పనిలో బిజీగా ఉన్నాయి. ఇప్పటి వరకు దాని నివారణకు వ్యాక్సిన్‌ లేదు. అయితే, మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో కొందరు డాక్టర్లను కాదని.. ఓ భూతవైద్యుడిని నమ్మారు.

అతడి చేష్టలతో కరోనా వైరస్‌ బారిన పడ్డారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని రత్లాంకు చెందిన ఓ భూతవైద్యుడు ముద్దుతో కరోనా రాకుండా చేస్తానని ప్రచారం చేసుకున్నాడు. జనాలను నమ్మించాడు. అంతే ఆయన దగ్గరకు జనం బారులు బారులుగా వచ్చారు. వచ్చిన వారి చేతులను ఆ భూతవైద్యుడు ముద్దాడాడు. చివరకు ఆ భూతవైద్యుడు అనారోగ్యం పాలయ్యాడు. దీంతో డాక్టర్ల వద్దకు పరుగుపెట్టాడు. డాక్టర్లు అతడికి పరీక్షలు నిర్వహించి కరోనా పాజిటివ్‌ అని తేల్చారు. ఆ మరుసటే రోజే ఆయన మరణించాడు.

దీంతో ఆ భూతవైద్యుడి కుటుంబ సభ్యులను టెస్ట్‌ చేస్తే వారిలో ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. ఆయనతో ముద్దులు పెట్టించుకున్న వారిలో కొందరికి ఈ విషయం తెలిసింది. తమకు కూడా ఈ వైరస్‌ సోకిందేమోనన్న అనుమానంతో వారు కూడా టెస్ట్‌ చేయించుకున్నారు. వారిలో కూడా 20మందికి కరోనా సోకినట్టు తేలింది. వారంతా ఇప్పుడు తీరిగ్గా ఆసుపత్రుల్లో చికిత్స

You might also like