FbTelugu

ప్లేట్లు, చెంచాలు నాకేసి కరోనా పెంచుతున్నారు

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వ్యాఖ్యలు

తిరుపతి: ఢిల్లీలో ఫంక్షన్లు చేసుకుని తినే ప్లేట్లు, చెంచాలు నాకేసి కరోనా వైరస్ ను వ్యాప్తి చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇకనైనా శుభ్రంగా ఉండాలని, ఐసోలేషన్, క్వారంటైన్ కేంద్రాలలో వారు వైద్యులకు సహరించడం లేదని అన్నారు. ఇకనైనా వారు తమ పద్దతి మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు.

ఒక వర్గాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే విమర్శలున్నాయి. సీఎం జగన్ రెడ్డి ప్రకటనకు పూర్తి వ్యతిరేకంగా నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి.

కరోనా వైరస్ వ్యాప్తికి కులం, మతం లేదని, నిజాముద్దిన్ మర్కజ్ మసీదు ఘటనకు మతం ముద్ర వేయడం సరికాదని జగన్ ఇటీవలే వ్యాఖ్యానించారు. కరోనా వ్యాప్తికి ఒక వర్గం వారే కారణమని ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో ప్లేట్లు, చెంచాలను నాకుతూ పడేస్తున్న దృశ్యాలు న్నాయి. ఈ వీడియో పాతదని, కరోనాకు సంబంధం లేదని తెలంగాణ పరభుత్వం తేల్చేసినా ఒక డిప్యూటీ సీఎం వారిని లక్ష్యం చేసుకుని విమర్శలు చేయడం పట్ల ప్రజలు ఆశ్చర్యపోయారు.

You might also like