FbTelugu

కల్నల్ కుటుంబాన్ని పరామర్శించనున్న కిషన్ రెడ్డి

హైదరాబాద్: కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని ఇవాళ బీజేపీ కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించనున్నారు. భారత్-చైనా సరిహద్దు గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.

వీరిలో తెలంగాణ ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నాడు. ఇవాళ కిషన్ రెడ్డి సూర్యాపేటకు వెళ్లి మధ్యాహ్నం మూడు గంటలకు సంతోష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

You might also like