FbTelugu

చెరో మెట్టు దిగితేనే సమస్య పరిష్కారం: కిషన్ రెడ్డి

kishan-reddy-speaks-about-rtc-strike-in-telangana

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికులు చెరో మెట్టు దిగితేనే సమస్య పరిష్కారం అవుతుందని బీజేపీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ విషయంలో ముఖ్యమంత్రిది తొందరపాటు చర్య అని అన్నారు. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం కక్షతో వ్యవహరించకూడదని, కార్మికుల పట్ల సానుభూతితో వ్యవరించాలని సూచించాడు. ఆర్టీసీ అంటే ప్రజలకు సేవ చేసే సంస్థ అని దానిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. పేద డ్రైవర్లు, కండక్టర్ల జీవితాల గురించి ప్రభుత్వం ఆలోచించాలన్నారు.

You might also like