FbTelugu

కరోనా టెస్టుల సంఖ్య పెంచేలా ఆదేశించండి: కిషన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో కరోనా టెస్టులపై దుమారం కొనసాగుతూనే ఉంది. ఐసీఎంఆర్ మార్గదర్శకాలు పాటిస్తూ.. కరోనా టెస్టుల సంఖ్య పెంచేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించండి అంటూ.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ ను కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి కోరారు.

ఇవాళ రాష్ట్ర తాజా పరిస్థితులపై, తెలంగాణలో కరోనా టెస్టులపై సూదీర్ఘంగా చర్చించారు. దేశంలో అతి తక్కువ కరోనా టెస్టులు చేసిన రెండవ రాష్ట్రంగా తెలంగాణ ఉందని కిషన్ రెడ్డి తెలిపారు.

You might also like