FbTelugu

హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ సమీక్షించాలి: కిషన్ రెడ్డి

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ మాస్టర్ ప్లాన్ ను పునఃసమీక్షించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి సిఎం కెసిఆర్ కు లేఖ రాశారు. ప్రజల అవసరాలకు తగిన విధంగా మార్పులు, చేర్పులు చేయాలన్నారు.

హెచ్ఎండిఏ, పంచాయతీలు, స్థానికల సంస్థల మధ్య సమన్వయం పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాజేంద్రనగర్, నార్సింగ్, శంషాబాద్, పటాన్ చెరు ప్రాంతాల్లో సర్వీసు రోడ్లు, రేడియల్ రోడ్లు పూర్తి చేయాలన్నారు. ఘట్ కేసర్, గౌడవెల్లి, శంషాబాద్, నాగులపల్లిలో బ్రిడ్జీలు నిర్మాణం చేయాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై దట్టమైన మొక్కలను తొలగించి చెట్లను పెంచాలని ఆ లేఖలో కిషన్ రెడ్డి కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.