FbTelugu

కరోనా వాక్సిన్ కేంద్రాలు రెట్టింపు చేస్తాం: కిషన్ రెడ్డి

దేశవ్యాప్తంగా నిన్నటి నుంచి 2 విడత ఉచిత వ్యాక్సిన్ ను ప్రారంభించామని కేంద్ర హోంశాఖ మంత్రి జీ. కిషన్ రెడ్డి తెలిపారు.
సోమవారం పీఎం మోదీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.

ప్రజలు అందరూ భయపడకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణలో ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో మొత్తం 91 కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇస్తున్నారన్నారు.
వ్యాక్సిన్ తీసుకున్నా తగిన జాగ్రత్తలు అందరూ పాటించాలి లేకపోతే ఇంట్లో వాళ్లకి ఇబ్బందులు వస్తాయి. ఏడాది క్రితం ఈరోజే గాంధీ కి మొట్టమొదటి కరోనా పేషెంట్ వచ్చిన రోజు, ప్రాణాలకు తెగించి ఏడాదికాలంగా గాంధీ ఆసుపత్రి కోవిడ్ చికిత్స అందిస్తున్నదని అన్నారు.

దేశవ్యాప్తంగా 10,000 కేంద్రాల్లో వ్యాక్సిన్ అందిస్తున్నామని కిషన్ రెడ్డి వివరించారు. వ్యాక్సిన్ ప్రొడక్షన్ బట్టి త్వరలోనే 20 వేలకు పెంచుతామన్నారు.
ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.250 కి మించి వ్యాక్సిన్ పై వసూలు చేయరాదన్నారు. గాంధీ ఆస్పత్రి లో కిషన్ రెడ్డి కోవాక్సిన్ వాక్సిన్ తీసుకున్నారు

You might also like

Leave A Reply

Your email address will not be published.