FbTelugu

ఎర్రగడ్డ ఘటనపై రిపోర్టు అడిగాం: కిషన్ రెడ్డి

ఢిల్లీ: దేశంలోని ప్రముఖ నగరాలలో కరోనా మహమ్మారి విజృభిస్తున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ.కిషన్ రెడ్డి తెలిపారు.
ఢిల్లీ, చైన్నై, ముంబై, హైదరాబాద్, కొలకతా లాంటి నగరాల్లో కరోనా వైరస్ విజృభిస్తున్నదన్నారు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ అగర్వాల్ బృందాన్ని హైదరాబాద్ కి పంపామన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన బృందం ఇక్కడి పరిస్థితులపై కేంద్రానికి సమగ్రమైన నివేదిక ఇవ్వనుందని కిషన్ రెడ్డి అన్నారు
ఈరోజు ఉదయం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ఎర్రగడ్డలోని ఛాతి ఆసుపత్రిలో జరిగిన సంఘటన బాధాకరమన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వనికి కరోనా విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.
మెడికల్ హబ్ గా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో కేసులు పెరగడం ఆందోళన కలిగించే అంశమన్నారు. చెస్ట్ ఆసుపత్రిలో కరోనా రోగి రవికుమార్ మృతి ఘటనపై ప్రభుత్వం ఏం చేయబోతుందో ప్రధాన కార్యదర్శి ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నాను అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

 

You might also like