FbTelugu

డేంజర్ జోన్ లో హైదరాబాద్: కిషన్ రెడ్డి

లాక్ డౌన్ నిర్ణయం రాష్ట్రాలకే ఇచ్చాం
ఢిల్లీ: హైదరాబాద్ డేంజర్ జోన్‌లో ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి హెచ్చరించారు. పాత సచివాలయాన్ని కొవిడ్ ఆసుపత్రిగా మార్చాలన్నారు.
దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, చెన్నైలతో పాటు హైదరాబాద్ డేంజర్ జోన్‌లో ఉందని కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని సూచించారు. కరోనా కట్టడి కోసం తెలంగాణకు కేంద్రంపెద్దఎత్తున సాయం చేసిందని అన్నారు.
తెలంగాణలో బెడ్లు లేక కరోనా పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం కేంద్రం దృష్టికి వచ్చిందని తెలిపారు. పాత సచివాలయంలో 3వేల బెడ్లను అందుబాటులోకి తీసుకురావచ్చని ఆయన అన్నారు. ఇంజినీరింగ్ కాలేజీలను కూడా ఐసోలేషన్ కేంద్రాలుగా ఉపయోగించాలని సూచించారు.

లాక్‌డౌన్ విధించడంపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని కిషన్‌రెడ్డి చెప్పారు. మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు కు ఇవ్వాల్సిన గౌరవం కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని, పీవీ పోస్టల్ స్టాంప్ విడుదలకు అంగీకరించిన ప్రధాని మోదీకి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.