FbTelugu

‘ప్రైవేటు’లో వసూళ్లు ఎక్కువయ్యాయి: కిషన్ రెడ్డి

హైదరాబాద్: ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్ల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈఎస్ఐ ఆస్పత్రిలో త్వరలో కోవిడ్ పడకలు ఎర్పాటు చేయనున్నట్టు తెలిపారు. టిమ్స్ లో ఒకే సారి చికిత్స అందేలా సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని అన్నారు. కేంద్ర తెలంగాణకు 1,200 వెంటిలేటర్లను ఇచ్చినట్టు తెలిపారు.

You might also like