FbTelugu

ప్రత్యక్షమైన కిమ్ పెళ్లాం

హైదరాబాద్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కుటుంబంలో ఎవరు ఎప్పుడు కన్పిస్తారో, ఎప్పుడు మాయమవుతారో తెలియని పరిస్థితి. కన్పిస్తేనే జీవించి ఉన్నట్లు లేదంటే వారి ప్రాణాలు గాల్లో కలిసినట్టే అనుకోవాలి.
కొద్ది రోజుల పాటు అధ్యక్షుడు కిమ్ కన్పించకుండా మాయమవుతారు. ఆ తరువాత ఆయన సోదరి అదృశ్యమవుతారు. కిమ్ భార్య కూడా ఎక్కడ ఉంటుందనేది కూడా ఎవరికీ తెలియదు. నెలల తరువాత ఎవరో ఒకరు బాహ్య ప్రపంచంలోకి వచ్చి ఏదో ఒక కార్యక్రమంలో ప్రత్యక్షమవుతారు.

కన్పించనన్ని రోజులు రకరకాల కథననాలు వెలుగులోకి వస్తాయి. ఈసారి భార్య రి సోల్-జు బహిరంగంగా ప్రత్యక్షమైంది. మంగళవారం నాడు భర్త కిమ్ తో కలిసి తన మామ కిమ్ జోంగ్ ఇల్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నది.
ఈ కార్యక్రమానికి ముందు కిమ్, ది కుమాసన్ ప్యాలెస్ ఆప్ ది సన్ లో తన తండ్రి తాతల సమాధులకు నివాళులు అర్పించారు. జయంతి కార్యక్రమంలో మాస్కులు ధరించకుండానే భార్యాభర్త పాల్గొనడం విశేషం, హాజరైన అతిధులు మాస్క్ ధరించలేదు. గతంలో కిమ్ తో పాటు భార్య కార్యక్రమాల్లో హాజరయ్యేవారు. వైరస్ కారణంగా ఆమె జనబాహుళ్యంలోకి రావడం లేదని ఇంటెలీజెన్స్ వర్గాలు ధృవీకరించాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.