FbTelugu

ముగ్గురు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తరువాత ఉగ్రవాదం తగ్గుముఖం పట్టినప్పటికీ అప్పుడప్పుడు ఉగ్రమూకల కదలికలు భద్రతా బలగాలకు పనిచెబుతున్నాయి.

షోపియాన్ జిల్లా బుద్గాం ప్రాంతంలో గురువారం అర్థరాత్రి ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు హతమయ్యారు. ఒక జావాన్ కు తీవ్ర గాయాలు కాగా ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదులు దాక్కున్నట్లు పక్కా సమాచారం రావడంతో అర్థరాత్రి జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు, సీఆర్పీపీఎఫ్ సిబ్బంది కార్డన్ సెర్చి ప్రారంభించాయి.

ఒక ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు బలగాలు రాగానే కాల్పులు ప్రారంభించారు. జవాన్లు ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. శుక్రవారం ఉదయం కూడా బలగాలు గాలింపును కొనసాగించాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.