FbTelugu

ఐదుగురు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్: అనంత్ నాగ్ జిల్లాల్లో గడచిన 24 గంటల్లో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు.

వాఘామా ప్రాంతంలో మంగళవారం ఉదయం ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు ఎన్ కౌంటర్ చేశాయన్నారు. సోమవారం సాయంత్రం ఇదే ప్రాంతంలో ముగ్గురు మిలిటెంట్లు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం వచ్చిందన్నారు. భద్రతా దళాలతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్, పోలీసులు కార్డన్ సెర్చి నిర్వహించి హతమార్చారన్నారు. చనిపోయిన వారులో ఒకరిని జమ్మూ కాశ్మీరఆ ఇస్లామిక్ ఫోర్స్ కమాండర్ జాహిద్ ధార్ గుర్తించామని విజయ్ కుమార్ తెలిపారు.

You might also like