FbTelugu

సొంత కుమార్తెనే చంపబోయారు?

కడప: రోజులు మారుతున్నా మనుషులు మాత్రం మారడం లేదు. కులాల అంతరాలు ఇంకా తొలగడం లేదు. తమ కూతరు వేరే కులం వాడిని ప్రేమించడాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు ఘాతుకానికి పాల్పడ్డారు.
దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటిలో ఒక యువతి వేరే కులం వ్యక్తిని ప్రేమించింది.

ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసి మరో పెళ్లి సంబంధం చూడగా, ససేమిరా అన్నది. ప్రేమించిన వాడితోనే సంసారం చేస్తానని స్పష్టం చేయడం తల్లిదండ్రులకు నచ్చలేదు. ప్రేమ వ్యవహారం ఇష్టంలేని తల్లిదండ్రులు రెండు రోజుల క్రితం తాము చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని బలవంత పెట్టారు. ఎంతకూ అంగీకరించకపోవడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, సోదరుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. యువతి కేకలు వేయడంతో ఆమె అక్క, ఇరుగు పొరుగు వారు వచ్చి మంటలను ఆర్పేశారు. అయితే అప్పటికే ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఇచ్చిన సమాచారం పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని బాధితురాలిని వెంటనే కడప రిమ్స్ కు తరలించి, కేసు నమోదు చేసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.