FbTelugu

విడాకులు కోరగానే కిరాతంగా చంపాడు

చెన్నై: విడాకులు కోరిన భార్యను గొంతు కోసం ఆమె శరీరంపై నుంచి కారు నడిపి అతి కిరాతంగా హత్య చేశాడో భర్త. ఈ ఘటన తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో చోటు చేసుకున్నది.
కోయంబత్తూర్ నివాసి గోకుల్ కుమార్ (40) కాటన్ కొళత్తూర్ లోని ఒక హాస్పిటల్ లో డాక్టర్ గా పని చేస్తున్నాడు. దగ్గరి బంధువు కీర్తనను మూడేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయి సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు కలగలేదు. కొద్ది రోజుల పాటు అత్తగారిల్లు అయిన చెంగల్పట్లు జిల్లా మధురాంతంకంలో ఉండేవాడు. ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు రావడంతో విడాకుల కోసం కోర్టులో పిటీషన్ వేశారు.

కోర్టులో కేసు నడుస్తుండగానే శుక్రవారం నాడు గోకుల్ కీర్తన నివాసానికి వెళ్లాడు. ఎదురుగా వచ్చిన మామపై కత్తితో పొడిచాడు. ఆ తరువాత కీర్తనను విచక్షణా రహితంగా పొడిచాడు. బయటకు లాక్కొచ్చి గొంతు కోసి, ఆ పై కారుతో ఆమె శరీరం మీది నుంచి నడిపి చంపేశాడు. చనిపోయిందని నిర్థరించుకున్న తరువాత అక్కడి నుంచి కారులో పరారీ అయ్యాడు. నేషనల్ హైవే పై వెళ్తూ టోల్ ప్లాజా వద్ద కారు బోల్తాపడడంతో గాయాలపాలయ్యాడు. చెంగల్పట్టు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. కీర్తన మృతదేహాన్ని పోస్టుమార్టం పంపించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.