FbTelugu

తాగిన మైకంలో స్నేహితున్నే చంపారు

మంచిర్యాల: తాగిన మైకంలో స్నేహితుడు అనే కనికరం లేకుండా చంపేస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగిందా, ఘర్షణ పడి క్షణికావేశంలో హత్య చేశారా అనేది తెలియాల్సి ఉంది.

మృతుడు నందగిరి ఉమేష్ చంద్ర తండ్రి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. లక్షెట్టిపేట మండలం దౌడపల్లి గ్రామానికి చెందిన నందగిరి ఉమేష్ చంద్ర (23) స్నేహితులతో కలిసి ఆదివారం దశదిన కర్మకు వెళ్లాడు. కార్యక్రమం ముగించుకున్న తరువాత రాత్రి ఇంటికి వస్తూ అందరూ కలిసి ఫూల్లుగా మద్యం సేవించారు. అందరు కలసి మద్యంతాగిన తర్వాత ఘర్షణ పడి ఉమేష్ చంద్రను కొట్టిచంపారు. మృతదేహాన్ని వెంకట్రావుపేట గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడేసి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారని తండ్రి ఆరోపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.