FbTelugu

దొంగను చంపి… 15 ఏళ్లుగా ఇంట్లోనే భద్రం!

సిడ్నీ: దొంగతనం చేయడానికి వచ్చిన దొంగను ఆత్మరక్షణ కోసం కాల్చి చంపాడు. ఇంత వరకు బాగానే ఉంది కాని అతని శవాన్ని 15 ఏళ్ల పాటు ఇంట్లోనే భద్రపర్చి, వాసన రాకుండా జాగ్రత్త పడ్డాడు. దుర్వాసన రావడంతో ఇంటి యజమాని గుట్టురట్టయింది.
సిడ్నీ నగరంలో ఉంటున్న బ్రుసెన్ రాబర్ట్స్ అనే వ్యక్తి ఇంటికి 2002 సంవత్సరంలో షేన్ స్నేల్ మెన్ అనే దొంగ చోరీ కోసం వచ్చాడు.

గుర్తించిన యజమాని బ్రుసెన్ కాల్చి చంపి, శవాన్ని ఇంట్లో దాచిపెట్టాడు. శవం నుంచి వాసన రాకుండా ఉండేందుకు వందల కొద్ది ఏయిర్ ప్రెషనర్లను ఉపయోగించాడు. ఏమైందో ఏమో కాని ఇంటి యజమాని 2017లో చనిపోయాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, స్థానిక అధికారులు రాబర్ట్స్ మృతదేహాన్ని తీసుకువెళ్లి దహనం చేశారు. ఇది జరిగిన ఏడాది తరువాత ఇళ్లు శుభ్రం చేసేందుకు వచ్చిన వారు మరో శవాన్ని చూసి పరుగులు తీశారు. మృతదేహం భద్రపర్చిన పెట్టె సమీపంలో పదుల సంఖ్యలో ఏయిర్ ప్రెషనర్స్ చూశారు. రాబర్ట్స్ ఇంటి నుంచి చాలా అరుదుగా బయటకు వచ్చేవాడని, ఇంట్లో 10కి పైగా తుపాకులను భద్రపర్చుకున్నాడని పోలీసులు తెలిపారు. వాటన్నింటిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.