FbTelugu

కిడ్నీ రాకెట్… భార్యాభర్తలకు టోకరా!

కృష్ణా: మనషుల బలహీనతలను ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకుంటున్న ముఠాల బారిన జనం పడుతునే ఉన్నారు.
సాధారణంగా కిడ్నీ విక్రయించిన తరువాత మోసపోవడం వింటున్నాం. కాని ఈ కేసులో విక్రయానికి ముందే మోసపోవడం గమనించిన భార్యాభర్తలు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారే. కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన భార్గవి, ఆమె భర్త తమ కిడ్నీలను విక్రయించాలని నిర్ణయించారు. అప్పుల బారిన పడిన వారు కొన్ని నెలలుగా వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారు. కిడ్నీలను విక్రయిస్తే డబ్బులు వస్తాయని ఎవరో చెప్పడంతో ఆ పనికి పూనుకున్నారు.
దీని కోసం వారు ఆన్‌లైన్‌ను ఆశ్రయించగా, ఒక్కో కిడ్నీకి రూ.2కోట్లు ఇస్తామని నేరగాళ్లు నమ్మబలికారు.

విక్రయానికి ముందు కొన్ని చెల్లింపులు చేయాల్సి ఉంటుందని చెప్పడంతో వారు చెప్పిన విధంగా చెల్లించారు. వివిధ ఖర్చుల పేరిట వీరి వద్దే 16.61 లక్షలకు పైగా దండుకున్నారు. మరో 5 లక్షలు కావాలని అడగడటంతో భార్యాభర్తలు బ్యాంకును సంప్రదించగా నకిలీ ఖాతా అని తేలింది. నిండా తాము మోసపోయామని గ్రహించిన భార్గవి, ఆమె భర్త పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు

You might also like