FbTelugu

బాలుని కిడ్నాప్, హత్య.. కేసులో బంధువుల హస్తం

మహబూబాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 9 ఏళ్ల బాలుడు దీక్షిత్ కిడ్నాప్ ఆపై హత్య కేసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు మనోజ్ రెడ్డి, మందసాగర్, మంద సంగర్ష్, కోరే అనీల్ అనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

వారిలో ఒకరు బాలుని బంధువు కావడం గమనార్హం. 18వ తేదీన సాయంత్రం బాలుడు కిడ్నప్ గురికగా అదేరోజు బాలుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు పలు విషయాలను ప్రాథమికంగా గుర్తించారు. సాగర్ అనే యువకుడు బాలున్ని కిడ్నాప్ చేసి తాళ్లపూసలపల్లికి తీసుకెళ్లాడు. దొరికి పోతానేమోనన్న భయంతో హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్టుగా గుర్తించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.