FbTelugu

కిడ్నాప్ బాలిక ఆత్మహత్య

హైదరాబాద్: కిడ్నాప్‌ నాటకమాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో మొదటి నుంచి అనేక అనుమానాలు ఉన్నా వాస్తవాలు వెలుగులోకి రావడం లేదు.

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన ఫార్మసీ విద్యార్థిని కొద్దిరోజుల క్రితం కాలేజీ నుంచి వస్తుండగా ఆటో డ్రైవర్ కిడ్నాప్‌, అత్యాచారం చేసినట్లు తల్లికి ఫోన్ చేసి తెలిపింది. ఆమె కట్టుకథ అల్లినట్లు రాచకొండ పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే. అందరి ముందు అభాసు పాలయ్యాయనని భావించిన అమ్మాయి, మున్ముందు పోలీసుల వేధింపులు తప్పవని భావించింది. ఈ రోజు ఉదయం అమ్మాయి నిద్ర మాత్ర గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.