FbTelugu

అప్పు చెల్లించలేదని కిడ్నాప్

తూర్పుగోదావరి : అప్పు చెల్లించలేదని ఓ వ్యక్తిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసిన ఘటన జిల్లాలోని మకిలిపురం మండలం, మోరిపోడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్డాల మోహన్ వంశీ అనే వ్యక్తి అప్పు తీసుకొని చెల్లించడం లేదని 9 మంది వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేశారు.

దీంతో మోహన్ వంశీ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు. మోహన్ వంశీని కిడ్నాపర్లు తీవ్రంగా కొట్టినట్టు గుర్తించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.