FbTelugu

బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు

మెదక్: పాపన్నపేట మండలం పోడ్చన్ పేటలో ఆడుకుంటూ వెళ్లిన మూడేళ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు.

వ్యవసాయ భూమిలో కొద్ది సేపటి క్రితమే 120 లోతు వరకు బోరు బావి వేశారు. నీరు రాకపోవడంతో పైన కప్పు వేయకుండా ఇవాళ సాయంత్రం వదిలేశారు. బోరు బావి యజమాని మూడో కుమారుడు సాయి వర్థన్ ఆడుకుంటూ సమీపం వరకు వెళ్లి అందులో పడిపోయాడు.

బాలుడిని రక్షించేందుకు 108 వాహనాలు అక్కడికి చేరుకుని, లోనికి ఆక్సిజన్ పంపే ప్రయత్నం చేస్తున్నారు. బాబును సురక్షితంగా బయటకు తీసే ప్రయత్నాలు మొదలయ్యాయి. సమాంతంగా తవ్వి బాబును రక్షించేందుకు రెండు ప్రొక్లెయిన్లను సిద్ధం చేశారు. హైదరాబాద్ నుంచి రెస్క్యూ టీమ్ కూడా బయలుదేరింది. రెండు గంటల వ్యవధిలో టీమ్ అక్కడకు చేరుకోనున్నది.

భూమి యజమాని గోవర్థన్ తన వ్యవసాయ భూమిలో నీటి కోసం ఇప్పటి వరకు మూడు బోరు బావులను తవ్వించాడు. ఇవ్వాళ వేయించిన బోరు బావిలో బాలుడు పడిపోయాడు.

You might also like